గోదావరి పుష్కరాలపై ఎండోమెంట్ కమిషనర్‌తో చర్చ

గోదావరి పుష్కరాలపై ఎండోమెంట్ కమిషనర్‌తో చర్చ

E.G: రానున్న గోదావరి పుష్కరాలు 2027 కోసం కొవ్వూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎండోమెంట్ కమిషనర్‌ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం కలిశారు. దేవాలయాల పునఃనిర్మాణం, ప్రహరీ నిర్మాణం, రూమ్స్, కాటేజీలు, ఎలక్ట్రికల్ పనులు వంటి కీలక అంశాలకు రూ. 22 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. పనులు వేగవంతం చేయాలని కోరారు.