జె.వెంకట్రామిరెడ్డి 30వ వర్ధంతి.. నివాళులర్పించిన సీపీఐ

జె.వెంకట్రామిరెడ్డి 30వ వర్ధంతి.. నివాళులర్పించిన సీపీఐ

కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె-రాయలపంతులపల్లె మధ్య ఉన్న జె.వెంకట్రామిరెడ్డి సమాధి వద్ద ఆదివారం సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు సంక్షేమం, రాయలసీమకు కృష్ణా జలాలు తేవడం, గండికోట ప్రాజెక్టు సాధన కోసం జెవీ అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని సీపీఐ సీనియర్ నాయకుడు పులి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.