గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

చిత్తూరు: రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ ఎం. గొల్లపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గంగ జాతరలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి గంగ జాతరలు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలన్నారు.