పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డీఎస్పీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డీఎస్పీ

TPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయ ఆవరణంలో 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి పాల్గొని, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.