రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: 33 కేవీ విద్యుత్ లైన్‌ల మరమ్మతుల కారణంగా అమరావతి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. రవికిరణ్ తెలిపారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసమే ఈ మరమ్మతులు చేపడుతున్నామని ఆయన చెప్పారు.