VIDEO: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణం

యాదాద్రి: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం జరిపించిన అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి, ఆగమశాస్త్రానుసారం కల్యాణోత్సవం జరిపించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.