VIDEO: నదీకోతకు గురవుతున్న లంక గ్రామాలు

కోనసీమ: అయినవిల్లి మండలం కొండుకుదురు లంక వద్ద గోదావరి నది కోతకు గురవుతుంది. ఇప్పటికే పంట పొలాలు నదిలో కలిసి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత ఇళ్ల సమీపంలోకి రావడంతో వరద వస్తే పరిస్థితి ఏంటని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, రివిట్మెంట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.