VIDEO: పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
సంగారెడ్డి పట్టణంలో పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారంతో నిన్న రాత్రి వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో కొన్ని చోట్ల 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే, జిల్లాలో పెట్రోల్ కొరత లేదని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అనవసరంగా నిల్వ చేసుకోవద్దని సూచించారు.