'21 మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు'

KDP: ప్రొద్దుటూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం దుకాణాలు ఉన్నాయని, దుకాణ దారులందరూ పర్మిట్ రూములకు అనుమతులు తీసుకోవాలని ఎక్సైజ్ ప్రోహిబిషన్ సీఐ సురేంద్రనాథ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.7.50 లక్షలు, పంచాయతీ పరిధిలో రూ.5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలని తెలిపారు. ఈ మేరకు మున్సిపాలిటీలో 18, గ్రామీణ ప్రాంతంలో 3 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు.