ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి

MNCL: ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్ వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన బాలస్వామి వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ పై మండలానికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ కింద బాలస్వామి ఇరుక్కుపోయాడు. గ్రామస్థులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా బాలస్వామి మృతి చెందాడు.