నేడు విజయనగరంలో జాబ్ మేళా
VZM: విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల మెసానిక్ టెంపుల్లో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్ జయరాం వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెప్మా, ఎన్ఐపియుఎన్ఎ భాగస్వామ్యంతో ఉదయం 8 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరపంచాయతీ పరిధిలోని నిరుద్యోగ యువత అర్హతగల పత్రాలతో హాజరు కావాలని సూచించారు.