'యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 22న వికాస ఆధ్వర్యంలో జరిగే ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసుగల వారు అర్హులని, 35 కంపెనీలకు సంబంధించి 1200 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.