VIDEO: 'యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం విఫలం '

SRPT: రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపిరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కోదాడ మండలం రామలక్ష్మీపురంలో ఆయన మాట్లాడుతూ.. సకాలంలో యూరియా అందకపోతే పంట దిగుబడి తగ్గుతుందని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి వెంటనే కేంద్రంతో చర్చలు జరిపి యూరియాను అధిక సంఖ్యలో దిగుబడి చేసుకోవాలని కోరారు.