సీఎం స్కిల్ సెంటర్ల ద్వారా ఉచిత శిక్షణ
నెల్లూరు జిల్లా యువతకు సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్(CMSEC) ద్వారా ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గీతాంజలి, ఆంధ్ర, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలల్లో జనవరిలో 180 మందికి శిక్షణ ఇచ్చారు. డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఖయ్యూమ్ కోరారు.