'మదర్ థెరిసా సేవలను స్పూర్తిగా తీసుకోవాలి'

AKP: మదర్ థెరిసా సేవలను స్పూర్తిగా తీసుకోవాలని వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు ఏకా శివ తెలిపారు. మంగళవారం నర్సీపట్నం వైసీపీ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుష్టు బాధితులకు ఆమె అందించిన సేవలు మరువలేనివని మున్సిపల్ ఛైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మీ పేర్కొన్నారు.