అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
WNP: ఖిల్లా గణపురం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ పురిటి నొప్పులతో బాధపడుతూ.. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గ్రామానికి చేరుకున్న వాహనం ఆమెను ఖిల్లా గణపురం ఆసుపత్రికి తీసుకెళుతుండగా సోలిపూర్ శివారిలో అంబులెన్స్ లోనే పాపను ప్రసవించింది. తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించామని, క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి భార్గవి పైలెట్ శ్రీనివాసులు తెలిపారు.