VIDEO: 'శిధిలమైన కల్వర్టును బాగు చేయండి'
AKP: నాతవరం నుంచి తాండవ వెళ్లే రహదారిలో కల్వర్టు శిథిలమైంది. కల్వర్టు రంధ్రం పడటంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఓ కర్రను పాతారు. కల్వర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు బయపడుతున్నారు. ఈ కల్వర్టు పూర్తిగా శిథిలమైతే రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.