'టీమిండియాకు కాబోయే కెప్టెన్ అయ్యర్'
పంజాబ్ కింగ్స్ జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విజయవంతంగా నడిపిస్తున్నాడు. 2025లో ఫైనల్ చేరిన PBKS, ఈ సీజన్‌లోనూ ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ వైశాఖ్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. అయ్యర్ భవిష్యత్తులో తప్పకుండా టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని పేర్కొన్నాడు. ఇందుకు కావాల్సిన అన్ని అర్హతలు అయ్యర్‌కు ఉన్నాయని కొనియాడాడు.