బీజేపీకి రాజీనామా చేసిన ఆరూరి
WGL: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనంతరం బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తాజాగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కూటికి చేరనున్నారని తెలుస్తోంది. నేడు రాజీనామా వార్త వెలుగులోకి రావడంతో వర్ధన్నపేట- స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో చర్చ మొదలైంది.