ఆదోని సీఐ శ్రీరామ్ బదిలీని నిలిపివేయాలి: ప్రజలు
KRNL: ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరాములు బదిలీపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారిని బదిలీ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. సీఐ శ్రీరాములు వచ్చిన తర్వాత అసాంఘిక శక్తులు భయపడ్డారని, సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, కాబట్టి ఈ బదిలీని తక్షణమే నిలిపివేయాలని వారు కోరుతున్నారు.