ప్రమాదకరంగా ఎన్నారం బ్రిడ్జి

ప్రమాదకరంగా ఎన్నారం బ్రిడ్జి

VKB: కోట్‌పల్లి మండలం ఎన్నారం సమీపంలోని బ్రిడ్జి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కొంతభాగం కొట్టుకుపోవడంతో, దీనిపై నుంచి వెళ్లాలంటే వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.