తహసీల్దార్ కార్యాలయం ఎదుట శవంతో ధర్నా

తహసీల్దార్ కార్యాలయం ఎదుట శవంతో ధర్నా

PLD: కారంపూడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ఉద్రిక్తత నెలకొంది. పొలం సంబంధిత వివాదంలో రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన బత్తుల ముసలయ్య (45), తండ్రి కోటయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ముసలయ్య మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉంచి బంధువులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు.