ఆదివారం సాయంత్రం 6 గంటల వరకే!
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార గడువు మరో 48 గంటల్లో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచార మైకులు మూగబోనున్నాయి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం.. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.