VIDEO: రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకొని స్వామివారి సేవలో తరిస్తున్నారు.