క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి

క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి

తూ.గో: అనపర్తి మండలం కుతుకులూరులో సంక్రాంతి పండగను పురస్కరించుకొని తాడి మురళీకృష్ణ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు.