పాఠశాలను తనిఖీ చేసిన MEO
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని యాదవపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ టి.వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన పఠన సామర్థ్యాలను, అసెస్మెంట్ బుక్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను గౌరవించి, బాగా చదివి తల్లిదండ్రుల నమ్మకాలను నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.