ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 228 అర్జీలు

కోనసీమ: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 228 అర్జీలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.