22ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
GNTR: 22ఏ కింద నమోదైన భూముల తొలగింపు కోసం వచ్చే దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి సీసీఎల్ఏ ప్రత్యేక రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.