VIDEO: యువకులతో సరదాగా.. ప్రభుత్వ విప్ వేముల
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన బిజీ షెడ్యూల్‌లోనూ సామాన్యులతో కలిసి సరదాగా గడిపారు. ఐకేపీ కేంద్రాల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. నార్కట్‌పల్లి మండలం చిన తుమ్మలగూడెంలో వాలీబాల్ ఆడుతున్న యువకులను చూసి ఆయన ఆగారు. ప్రొటోకాల్ పక్కన పెట్టి, స్వయంగా కోర్టులోకి దిగి వారితో కలిసి వాలీబాల్ ఆడారు.