'పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి'
NZB: బడా భీమ్గల్ GP కార్యాలయంలో ఇవాళ ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధని శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు అందించే సేవలు వెలకట్టలేనివి. వారు అంకిత భావంతో పనిచేస్తేనే గ్రామాలు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంటాయని కొనియాడారు.