VIDEO: గాయపడిన నెమలికి వైద్య చికిత్స
CTR: చెట్టుపై నుంచి కిందపడి గాయపడిన నెమలికి అటవీ శాఖ అధికారులు చికిత్స అందించారు. పుంగనూరు రూరల్ మంగళం గ్రామ సమీపాన చెట్టు కింద గాయపడి ఉన్న నెమలిని ఓ రైతు గుర్తించి అటవీశాఖ అధికారులకు మంగళవారం అప్పగించారు. నెమలికి ఈ రోజు పశు వైద్య శాఖ డాక్టర్ వైద్యం చేశారు. దీంతో నెమలి పరిస్థితి కుదుటపడగానే అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని అధికారులు తెలిపారు.