‘వరి ధాన్యం తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలి’
KMR: వరి ధాన్యం తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ చెప్పారు. ఇవాళ బిక్కనూరు మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సెంటర్ ఇన్‌ఛార్జ్ రమేష్, సీఈవో రాజు సిబ్బంది ఉన్నారు.