'ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు'
KMM: ప్రజల జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో మాట్లాడుతూ.. పాదయాత్రలో వచ్చిన అంశాల వారిగా పథకాలు పెడుతున్నామన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా, పౌష్టికాహార పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దేశంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇస్తున్నామన్నారు.