నేటి నుంచి ఉర్సు ఉత్సవాలు
SRPT: తెలంగాణలో ప్రసిద్ధి గాంచి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి సమీపంలోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఇవాళ సా.4గం.లకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు