1వ తరగతి ప్రవేశాలకి అనాథ పిల్లలకు ఆహ్వానం

పాడేరు: వచ్చే విద్యా సంవత్సరానికిగాను ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం కోటా ద్వారా ఒకటో తరగతిలో ప్రవేశాలకు అనాథులు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. విద్యార్థులు http:cse.ap.gov.in వెబ్‌సైట్‌లో వచ్చే నెల 14లోగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.