నేడు వాడరేవుకు గవర్నర్ రాక
BPT: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నేడు చీరాల మండలం వాడరేవుకు రానున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తీరంలోని ఓ అతిథి గృహంలో విడిది చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు చేశారు. నేడు, రేపు రెండు రోజులు పాటుగా గవర్నర్ వాడరేవులో గడపనున్నారు.