VIDEO: విద్యుత్ స్తంభానికి అల్లుకున్న ముళ్ళ తీగలు
SKLM: నరసన్నపేట పట్టణంలోని పోలాకి రహదారిలో ప్రశాంతి నగర్ వద్ద విద్యుత్ స్తంభానికి ముళ్ళ తీగలు అల్లుకుపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు మంటలు కూడా చెలరేగుతున్నాయని, వెంటనే వీటిని తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.