అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
WGL: తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శంకుస్థాపన చేశారు. 19, 21 డివిజన్లలో కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.