'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'
KMM: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి మంధనపు రామారావు డిమాండ్ చేశారు. గురువారం నేలకొండపల్లి మండలంలో వర్షానికి దెబ్బతిన వరి పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి వర్షానికి నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించాలన్నారు.