'అదనంగా ధాన్యం తీసుకుంటే కఠిన చర్యలు'

పార్వతీపురం: రైతుల వద్ద నుండి అదనంగా ధాన్యం తీసుకుంటే మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు ఒక్క గింజ ధాన్యం కూడా అదనంగా మిల్లర్లకు ఇవ్వరాదని ఆయన కోరారు. రైతులను దోపిడీ చేయుటకుప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.