మేడిపల్లిలో రోడ్ల పరిస్థితి ఇది..!
MDCL: మేడిపల్లి పరిధి కెనరా నగర్, ఎమ్మార్వో ఆఫీస్ వెళ్లే మార్గంలో రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.