శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి.. ప్రజల ఇబ్బందులు

శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి.. ప్రజల ఇబ్బందులు

NDL: నందమూరి నగర్, రాయమల్పురం, పోలూరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుందూ నదిపై నిర్మించిన పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభమైనా, ఏళ్లుగా నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. తుఫాను, భారీ వర్షాల కారణంగా ఈ మార్గం మూసివేశారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.