GOOD NEWS: రైతుల అకౌంట్లో డబ్బులు జమ
TG: రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం ఈ నిధులు విడుదల చేశారు. రెండో విడతలో 1 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. కాగా, తొలి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే.