VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎర్ర కాలువ

W.G: తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో కంసాలిపాలెం కాజ్ వే వద్ద ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీరు జంగారెడ్డిగూడెం వద్ద కరాటం ఎర్రకాలువ జలాశయానికి నీరు చేరుతుంది. దీంతో ఆదివారం నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎర్ర కాలువ ప్రవాహం వేగంగా ముందుకు సాగుతోంది.