సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

SKLM: మందస మండలంలోని సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘం అధ్యక్షులు బెస్త కామేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో మందస తహసీల్దార్ ఎస్.హైమావతికు వినతి పత్రం అందజేశారు. మండలంలోని సాగునీటి వనరులు మరమ్మతులకు గురయ్యాయని తక్షణమే నిధులు మంజూరు చేసి వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.