'కేంద్రం రూ.42.. రాష్ట్రం రూ.15 మాత్రమే'
TG: ఉచిత బియ్యం కేంద్రం అమలు చేస్తున్న పథకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేజీ బియ్యానికి రూ.42 కేంద్రమే ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ బియ్యానికి రూ.15 మాత్రమే ఇస్తుందని చెప్పారు. సన్న బియ్యం పథకం తమది అంటూ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు.