'ప్రజా సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలి'

'ప్రజా సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలి'

కృష్ణా: తాడి గడప క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథికి అందిన ఫిర్యాదులను విపులంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కారం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.