'చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం'

'చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం'

VZM: చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ. విజయ్ రాజ్ కుమార్ అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో సర్పంచ్ గేదెల ఈశ్వరరావు అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.