రాకేష్ వర్మ మాతృమూర్తికి ఎమ్మెల్యే నివాళులు

కోనసీమ: తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాట్ల రాకేష్ వర్మ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హైదరాబాదులోని రాకేష్ వర్మ గృహానికి వెళ్లి ఆయన మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి, సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.