VIDEO: 'సైన్స్' ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఛైర్మన్

VIDEO: 'సైన్స్' ఎగ్జిబిషన్‌ను  సందర్శించిన ఛైర్మన్

KNR: జమ్మికుంట పట్టణంలోని బాలికల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ సందర్శించారు. విద్యార్థినులు రూపొందించిన వివిధ నమూనాలను పరిశీలించి వారిని ఆయన అభినందించారు. తల్లిదండ్రులు పిల్లల్లోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలని, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్ పాల్గొన్నారు.